ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్పై గవర్నర్కు రఘనందన్ రావు ఫిర్యాదు

Byline :  Krishna
Update: 2023-12-22 09:20 GMT

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ తమిళిసైకు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. వెంకటయ్య రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించింది. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకుని ప్రచారం చేయడం సరికాదని రఘునందన్ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను గవర్నర్‌కు అందజేసినట్లు చెప్పారు. వెంకటయ్యను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని గవర్నర్ ను కోరానని.. దానిపై ఆమె సానుకూలంగా స్పందించారని రఘునందన్ చెప్పారు.

Tags:    

Similar News