ప్రజాయుద్దనౌక గద్దర్ మరణించారు. ఆయన మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గద్దర్ మరణం ఎంతో బాధించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విఠల్ రావు మరణం బాధాకరం. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమ అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
గద్దర్ పాటలు మన గుండెలపై చెరగని ముద్ర వేశాయని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘దిగ్గజ కవి, ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్ రావు మరణవార్త ఎంతో బాధ కలిగించింది. సామాజిక సమస్యల పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. గద్దర్ జీ శక్తివంతమైన పాటలు లక్షలాది మంది ఆకాంక్షలను ప్రతిధ్వనించాయి, మన హృదయాలపై చెరగని ముద్ర వేశాయి’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.