తెలంగాణలో గెలవగానే కులగణన చేపడతాం : రాహుల్

By :  Krishna
Update: 2023-11-17 11:40 GMT

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతామని రాహుల్ గాంధీ అన్నారు. ఏయే కులాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్లో కొండా సురేఖకు మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీని సాగనంపడమే తమ లక్ష్యమన్నారు.

తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించాం కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని రాహుల్ అన్నారు. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు మోదీ తన కార్పొరేట్ స్నేహితులకు మాత్రమే మేలు చేస్తారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒకరికోసం ఒకరు పనిచేస్తాయని విమర్శించారు. ఎంఐఎం బీజేపీకి సపోర్ట్ చేస్తుందని..

ఒక్కొక్కో రాష్ట్రంలో ఆ పార్టీది ఒక్కో రేట్ ఉంటుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6గ్యారెంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.2,500 వేయడంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు 12వేలు అందజేస్తామన్నారు. విద్యార్థుల చదువు, కోచింగ్‌ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు, వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు ఇస్తామని చెప్పారు. పేదలకే మంచి చేయడమే తమ లక్ష్యమని.. కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News