కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని తాను గతంలో చెప్పిన విషయాన్ని ప్రధాని నిజామాబాద్ బహిరంగ సభలో అంగీకరించారన్నారు. బీఆర్ఎస్ - బీజేపీ దోస్తీ తెలంగాణను నాశనం చేసిందని ఆరోపించారు. ప్రజలకు బీజేపీ - బీఆర్ఎస్ ఆటలు అర్ధమయ్యాయని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసిట్లు చెప్పారు. ఆ సమయంలో ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరారని.. దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. అయితే మీరేమైనా రాజులా అని కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఆయన ముందు పెట్టానని స్పష్టం చేశారు. కేసీఆర్కు తన కళ్లలోకి చూసే ధైర్యం లేదని మోదీ ఎద్దేవా చేశారు.
जो मैंने कहा था आज मोदी जी ने उसे खुलेआम कबूल कर लिया - BRS मतलब BJP Rishtedaar Samiti.
— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2023
BJP-BRS की Partnership ने पिछले दस सालों में तेलंगाना को तबाह कर दिया है।
लोग समझदार हैं और इनका खेल समझ गए हैं - इस बार वो इन दोनों को ठुकरा कर कांग्रेस की 6 गारंटी वाली सरकार बनाएंगे।