Telangana Congress Election Campaign : ప్రజా తెలంగాణ కోరుకుంటే.. దొరల తెలంగాణ వచ్చింది: రాహుల్ గాంధీ

By :  Bharath
Update: 2023-10-20 08:28 GMT

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగిత్యాలలో రోడ్ షో నిర్వహించారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సెంటర్ లో జరిగన రోడ్ షోలో మాట్లాడిన రాహుల్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ నియంతృత్వ దొరల పాలనకు, ప్రజలకు మధ్య జరుగుతుందని చెప్పారు. ప్రజల పోరాటంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో.. రాచరిక పాలన ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దందాలు, మాఫియాలు పెరిగి.. ఒక కుటుంబం చేతిలో బంధీ అయిపోయిందని ఆరోపించారు. 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుని తమ జేబులు నింపుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసిన షుగర్ ఫాక్టరీని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెరుస్తామని హామీ ఇచ్చారు. పసుపు మద్దతు ధరను రూ. 12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటిపై అదనంగా రూ.500 పెంచుతామని హామీ ఇచ్చారు.

అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఓబీసీ కులగణన చేపడతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. బలహీనవర్గాల కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. కులగణన అనేది దేశానికి ఎక్స్రే లాంటిదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల కోసం ప్రకటించిందని, దొరల కోసం కాదని అన్నారు. బీజేపీ తన పదవిని, ఇంటిని లాక్కుందని.. తనకు ఇళ్లు లేకపోయినా ప్రజల గుండెల్లో చోటుంటే చాలని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News