తెలంగాణలో ప్రజా సర్కారు మొదలైంది: రాహుల్‌ గాంధీ

By :  Bharath
Update: 2023-12-07 11:06 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ప్రజా సర్కారు మొదలైందని తెలిపారు. బంగారు తెలంగాణ కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.






Tags:    

Similar News