దుక్కిదున్ని వరినాట్లు వేసిన రాహుల్ గాంధీ

Update: 2023-07-08 06:07 GMT

రాహుల్ గాంధీ రైతుగా మారారు. జోడో యాత్ర దగ్గర నుంచి ప్రజలతో మమేకమవుతున్న ఆయన దాని తర్వాత కూడా జనాల్లోనే ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హరియాణాలో సోనిపట్ ను ఆకశ్మికంగా పర్యటించారు. అక్కడ రైతులతో మాట్లాడి...వాళ్ళతో పాటూ కలిసి పని చేశారు.




 


ఢిల్లీ నుంచి సిమ్లా వెళుతున్న రాహుల్ గాంధీ మధ్యలో సోనిపట్ లో ఆగారు. బరోడా, మదీనా గ్రామాల్లో తిరిగారు. అక్కడ రైతులతో మాట్లాడారు. పొలం పనుల్లో ఉన్న రైతుల దగ్గరకు వెళ్ళి పనులు చేశారు. పొలంలోకి దిగి ట్రాక్టర్ నడిపారు. రైతులతో కలిసి వరి నాట్లేశారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.




 


రాహుల్ గాంధీ చాలాకాలంగా ప్రజలతోనే ఉంటున్నారు. భారత్ జోడో యాత్రలో కూడా జనాలతో కలిసిపోయారు. ఆమధ్య ఢిల్లీ-ఛండీగడ్ మైవే మీద ట్రక్కు నడిపి లారీ డ్రైవర్ల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. మరోసారి ఓ మెకానిక్ దుకాణంలో బండిని రిపేర్ చేస్తూ కనిపించారు. కర్ణాటకలో స్విగ్గీ డ్రైవర్ల వెనుక బండి మీద కూర్చుని ప్రయాణించారు. ప్రజల మనిషిగా ఉంటూ ప్రజల మనిషిని అనిపించుకోవడానికి రాహుల్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.



Tags:    

Similar News