రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి వందే భారత్ స్లీపర్ రైలు, వందే మెట్రోలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం కోసం వందే భారత్ స్లీపర్ , తక్కువ దూరం ప్రయాణించే పాసింజర్స్‌కు వందే మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పింది.
వచ్చే ఏడాది జనవరిలో వందే మెట్రో, మార్చిలో వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రకాల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల కోచ్ లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేయనుంది. గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ రైళ్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి ఈ స్లీపర్ కోచ్‌లు ఎంతో సౌకర్యంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.
రాజధానికి ప్రత్యామ్నాయంగా వందే భారత్ స్లీపర్ ట్రైన్స్, అలాగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా చైర్‌కార్ వెర్షన్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ మొత్తం 400 వందే భారత్ ట్రైన్స్‌కు ఆర్డర్ ఇచ్చింది. వాటిలో 200 రైళ్లు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో సీటింగ్ డిజైన్ తో స్టీల్‌తో తయారుచేయనున్నారు. మిగిలిన ట్రైన్స్‌ను స్లీపర్ కోచ్‌లను సిద్ధం చేస్తారు. వీటిని అల్యూమినియంతో రూపొందిస్తారు. ఈ వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ తొలుత ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - కోల్‌కతా మార్గంలో నడపనున్నారు. ఇందుకోసం ఆ మార్గంలో ట్రాక్స్ రిప్లేర్లు, సిగ్నల్ సిస్టమ్, వంతెనలు, ట్రాక్‌ల ఫెన్సింగ్ లోపాలను సరిదిద్దాలని భావిస్తోంది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తీసుకువస్తున్న వందే మెట్రో 12 కోచ్‌లతో సిద్ధం చేయనున్నారు.