తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు..3 రోజులపాటు వర్షాలు

Byline :  Vamshi
Update: 2024-03-16 13:29 GMT

ఎండల్లోతో అల్లాడిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుకులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి 18వ తేదీ వరుకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీకి వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణశాఖ(IMD). ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఈ వర్షాలు ఉంటాయని పేర్కొంది.

ఇక దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో కూడా ఇవాళ, రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని, వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. గంగానది పరివాహన బెంగాల్ నుంచి ఉత్తర కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు విదర్భ వరకు ఛత్తీస్ ఘడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కర్ణాటక మరియు పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరిత ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.

Tags:    

Similar News