తెలంగాణలో పగటి పూట ఎండ, రాత్రి చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణలో ఈ నెల 9వరకు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ద్రోణి సహా బలమైన గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని చెప్పింది. నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా రాష్ట్రంలో పగలు ఎండలు మండిపోతుండగా, రాత్రిళ్లు, ఉదయం వేళల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 16.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.