సస్పెన్షన్ ఎత్తివేత, టికెట్ కన్ఫామ్ చేయడంపై స్పందించిన రాజా సింగ్

By :  Kiran
Update: 2023-10-22 08:51 GMT

సస్పెన్షన్ ఎత్తివేత, పార్టీ ఫస్ట్ లిస్టులో తన పేరు ఉండటంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనపై నమ్మకంతో సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ కు కృతజ్ఞతలు చెప్పారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని బీజేపీ హైకమాండ్కు సూచించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ లకు ధన్యవాదాలు చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని నమ్మినందునే సస్పెన్షన్ ఎత్తివేశారని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఫస్ట్ లిస్టులో తన పేరు ఉండటంపై రాజాసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. జైలులో ఉన్నప్పుడు, బయటకు వచ్చాక కూడా అదే సపోర్ట్ కొనసాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం, పార్టీ టికెట్ కన్ఫామ్ చేయడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. రాజాసింగ్ నివాసం వద్ద పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు.




Tags:    

Similar News