MLA Rajaiah : దేవుడున్నాడు.. దేవుడి లాంటి కేసీఆర్ ఉన్నాడు: రాజయ్య

Update: 2023-08-25 14:10 GMT

బీఆర్ఎస్ పార్టీ అధిస్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేసరికి రాష్ట్రంలో రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. టికెట్ రాలేదని కొందరు బీఆర్ఎస్ నేతలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని పార్టీ అధిస్టానం ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యలున్న వివాదాలు, రాజయ్యపై వచ్చిన ఆరోపణలను పరిగణంలోకి తీసుకున్న పార్టీ.. రాజయ్యను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక రాజయ్య రాజకీయ జీవితం ముగిసింది అని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన.. ఆరు నూరైనా ప్రజా జీవితంలోనే, ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం చేశారు. పంట పండించి, రాసి పోసిన తర్వాత ఎవరో వస్తానంటే ఊరుకుంటానా? అంటూ కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడారు. దేవుడున్నాడు.. దేవుడి లాంటి కేసీఆర్ ఉన్నాడు. రేపో మాపో అనుకున్న కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తన పనితనాన్ని గుర్తించి న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్పూర్ ప్రజల కోసమే తాను ఉన్నానని, ప్రజల మధ్యలోనే చనిపోతానని తెలిపారు. ఈ క్రమంలో రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. పార్టీ మారతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News