Rajya Sabha elections : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. కాసేపట్లో అధికారిక ప్రకటన..!

Byline :  Krishna
Update: 2024-02-20 07:30 GMT

రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. తెలంగాణలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో రెండు కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే ఈ మూడు స్థానాలకు 3 నామినేషన్లే వచ్చాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరీ, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్ డ్రా తర్వాత ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నర్ ఆఫీసర్ ప్రకటించనున్నారు.

కాగా మొత్తం 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగుతోన్నాయి. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ముగియనుడంతో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఏపీలో మూడు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది.

Tags:    

Similar News