Akhil Pailwan : గుట్టుగా వ్యభిచారం.. అడ్డంగా దొరికిపోయిన రామ్నగర్ అఖిల్ పహిల్వాన్..

Byline :  Krishna
Update: 2024-01-20 09:29 GMT

హైదరాబాద్లో గుట్టుగా సాగుతోన్న వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. గురువారం బట్టబయలైన ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం అబిడ్స్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫర్ట్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నీచమైన దందా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో అఖిల్ పహిల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్తో పాటు మరో ఇద్దరు నిర్వాహకులు 16మంది అమ్మాయిలు, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలు కలకత్తా, ముంబైకి చెందినవారీగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News