సీఎంగా రేవంత్ రెడ్డి.. రాంచరణ్ తేజ్ ఏమన్నాడంటే..?

Byline :  Krishna
Update: 2023-12-09 11:04 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన విషెస్ చెప్పారు. చిరంజీవి, అల్లు అరవింద్ సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ రేవంత్ కు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ రేవంత్ రెడ్డికి స్పెషల్ విషెస్ తెలిపారు. ‘‘ తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి నా అభినందనలు. మీ నాయకత్వం రాష్ట్రంలో సానుకూల మార్పులు తీసుకరావాలని కోరకుంటున్నాను’’ అని చరణ్ ట్వీట్ చేశారు.

అంతకుముందు సూపర్ మహేష్ బాబు కూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి నా అభినందనలు. మీ నాయకత్వంలో తెలంగాణ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నా’’ అని మహేష్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News