గ్రామం చిన్నదైనా ప్రజల మనసు పెద్దది : హరీష్ రావు

Update: 2023-08-26 11:41 GMT

తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో పొలిటికల్ పార్టీల్లో హీట్ పెరిగింది. సిద్ధిపేట మండంలోని రాంపూర్ గ్రామస్థులు బీఆర్ఎస్కే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని మంత్రి హరీష్ రావుకు అందజేశారు. గ్రామం చిన్నదైనా ఇక్కడి ప్రజల మనసు పెద్దదని హరీష్ రావు అన్నారు. గ్రామస్థులు ఏకగ్రీవంగా బీఆర్ఎస్కు మద్ధతు తెలపడం సంతోషంగా ఉందన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టుతో చిన్న గ్రామమైన రాంపూర్లో 18లారీల యాసంగి పంట పండిందని హరీష్ రావు తెలిపారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే రాంపూర్ గ్రామంలో బోరు బండ్ల మోత మోగేదని.. కానీ బీఆర్ఎస్ వచ్చాక సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు. కడుపులో పడ్డ బిడ్డ నుంచి పెద్దవాళ్ల దాక అందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

నెలరోజుల్లో రుణమాఫీ పూర్తిగా అయిపోతుందని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తిట్టడంలో పోటీపడుతుంటే.. సీఎం కేసీఆర్‌ వడ్లు పండించడంలో పోటీపడుతున్నారని చెప్పారు. సీఎం కృషివల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. గతంలో ఏడు ఓట్లు తప్ప మిగతావన్నీ బీఆర్ఎస్‌కే పడ్డాయని.. ఈ సారి ఆ ఏడు ఓట్లు కూడా ఎటు పోకుండా చూడాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News