మాదాపూర్‌లో రేవ్ పార్టీ... సినీ నిర్మాత వెంకట్ అరెస్ట్!

Byline :  Lenin
Update: 2023-08-31 02:21 GMT

హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్ విఠల్ రావు నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంటులో గుట్టుచప్పుడు కాకుండా మత్తుపదార్థాలతో చిందులు వేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు దాడి చేశారు. పలువురు యువతులను, కొంతమంది పురుషులను అరెస్ట్ చేశారు. వీరితో సినీ నిర్మాత వెంకట్ సహా కొందరు సెల సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి దగ్గర్నుంచి డ్రగ్స్‌ను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

Tags:    

Similar News