Gold Rate Hike:ఆశలు ఆవిరి...రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-27 04:32 GMT

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజులుగా ధరలు నిలకడగా ఉండడంతో.. భవిష్యత్ లో తగ్గే ఛాన్స్ ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. పసిడి మళ్ళీ పెరుగుదల బాట పట్టింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో అదే ధోరణిలో దేశీయంగా కూడా మార్కెట్లు కదులుతున్నాయి. ఈరోజు(డిసెంబర్ 27న)అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో దేశీయంగాను బంగారం ధరలు(Gold Rate Hike) పైకెగశాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,400ల వద్ద చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం కూడా 220 రూపాయలు పెరిగి రూ. 63,710ల వద్దకు చేరింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగి రూ.58,550ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి రూ.63,860ల వద్దకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలున్నాయి.

ఇక వెండి ధరలు కూడా ఈరోజు మళ్ళీ పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలతో పటు వెండి ధరలు కూడా కేజీకి 300 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.81,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ.79,500లుగా ఉంది.  

Tags:    

Similar News