పసుపు రైతులకు పండగే.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

Byline :  Bharath
Update: 2024-02-29 15:05 GMT

పసుపు పంట పసిడి పంటగా మారే రోజొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో పసుపు పంటకు రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజన్‌లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు.. దాన్నే కొనసాగిస్తూ రోజురోజుకు ఎగబాకుతున్నాయి. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం (ఫిబ్రవరి 28) రోజున.. పాత రికార్డు బ్రేక్‌ అయ్యింది. గురువారం (ఫిబ్రవరి 29) క్వింటా పసుపు ధర గరిష్ఠంగా రూ.15,025 పలికింది. కాగా ఇదే ఈ సీజన్‌ అత్యధికం కావడం గమనార్హం. బుధవారం క్వింటాకు రూ.14,255 చొప్పున ధర పలికిన విషయం తెలిసిందే. అయితే క్వింటా పసుపు ఆల్ టైం రికార్డ్ ధర 2011లో నమోదైంది. అప్పుడు క్వింటా పసుపు రూ.16,166 పలికింది.

ఏటా పసుపు విస్తీర్ణం తగ్గిస్తూ సాగుకు దూరమవుతున్న క్రమంలో.. ధర మళ్లీ పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2011 తర్వాత పసుపు ధర రూ.6-7 వేల మధ్యే ఉండేది. ఈ సీజన్ లో మాత్రం ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. పదేళ్ల తర్వాత మళ్లీ రికార్డ్ ధర పలకడంతో.. జిల్లాల్లో పూర్వవైభవం సంతరించుకుంది.

Tags:    

Similar News