MLA Rekha Naik : టికెట్ రాకుంటే.. రెబల్గా పోటీ చేస్తా: ఎమ్మెల్యే రేఖా నాయక్

By :  Bharath
Update: 2023-09-18 10:42 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మండిపడ్డారు. రూ. 2.25 కోట్ల ACDP నిధులు రిలీజ్ కాకుండా ఆపి తతను అణగతొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ లోని ఎన్టీఆర్ చౌరాస్తాలో ధర్నా చేస్తానని హెచ్చరించారు. తన దగ్గరున్న ఎస్బీ కానిస్టేబుల్ సెక్యూరిటీని తీయడం సరికాదని పోలీసులపై ఫైర్ అయ్యారు. తన కృషి వల్లే ఖానాపూర్ లో జాన్సన్.. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు అయ్యాడని తెలిపారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోయినా.. రెబల్ గానైనా, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెప్పారు.

నియోజక వర్గంలో కక్షపూరితంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనులను ఆపడం సరికాదని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్తారని అన్నారు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినా.. కక్షగట్టి కావాలనే ళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనుల నిధులు రాకుండా ఆపారని ఆరోపించారు. తన భర్త కాంగ్రెస్ పార్టీలో చేరితే తనను కూడా కాంగ్రెస్ నేత అని తప్పుబట్టడం సరికాదని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా తనను ఎందుకు తప్పుబట్టరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేశా, నియోజక వర్గ అభివృద్ధికోసం 9 ఏళ్లుగా శ్రమించా.. అయినా తనను తప్పుబడుతూ నిధులు ఆపడంపై మండిపడ్డారు.

Tags:    

Similar News