ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో రేణూదేశాయ్ పిటిషన్

By :  Lenin
Update: 2023-08-05 11:40 GMT

రేణు దేశాయ్...తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద గుస్సా అయింది. ఏకంగా కోర్టులో పిటిషనే దాఖలు చేసింది.

అసలు విషయం ఏంటంటే....తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఆక్వా మెరైన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నగర శివార్లలో కొత్వాల్ గూడలో ఆక్వా మెరైన్ పార్క్, బర్డ్ పార్క్ లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం కృత్రిమ సరస్సును సృష్టించాలనుకుంటోంది. అయితే దీనివలన పర్యావరణానికి ప్రమాదం అంటోంది నటి, సోషల్ యాక్టివిస్ట్ రేణూ దేశాయ్. వెంటనే పార్క్ ను నిర్మించడం ఆపేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమెతో పాటూ నటి దివ్యశ్రీ, డైరెక్టర్ శశికిరణ్, హీరోయిన్ పదాతో పాటూ మరికొంత మంది సెలబ్రిటీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. వీరందరూ కలిసి జూన్ 27న కోర్టులో పిటిషన్ వేశారు.

రేణూ దేశాయ్ వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. వీరి పిటిషన్ ని పరిశీలించిన న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారామ్ జి ధర్మాసనం.. ఇలాంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో జరిగింది. మన దేశంలో ఎందుకు జరగకూడదు అని ప్రశ్నించింది. 

Tags:    

Similar News