Breaking News : రేవంత్ సంచలన నిర్ణయం.. కాళేశ్వరం టూర్కు కేసీఆర్

Byline :  Krishna
Update: 2024-02-10 05:59 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దీనిపై విజిలెన్స్ నివేదిక సిద్ధమైంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. మేడిగడ్డతోపాటు కాళేశ్వరంలోని అన్నీ ప్రాజెక్టులను ఎమ్మెల్యేలకు చూపించనున్నారు. ఈ నెల 13వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సివున్నా.. 12నే ముగించనున్నారు.




 


ఈ సందర్శనకు కేసీఆర్ను ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయించారు. కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. సీఎం ఆదేశాలతో ఉత్తమ్ స్వయంగా వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించనున్నారు. అయితే అదే రోజు బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ ఛలో నలగొండకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం సందర్శనను సైతం అదేరోజు ఏర్పాటు చేయడం గమనార్హం.


Tags:    

Similar News