Mynampally Hanumanth Rao Tickets Issue :మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు : రేవంత్ రెడ్డి

By :  Krishna
Update: 2023-09-27 15:20 GMT

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. దీనిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్ఫార్మ్ చేశారు. అదేవిధంగా మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందని చెప్పారు. త్వరలోనే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం పార్టీలో చేరుతారని చెప్పారు. పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని.. అయితే స్థానిక పరిస్థితులను బట్టి టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు (Mynampally Hanumanth Rao Tickets Issue)

బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. బీసీలకు 34 సీట్లు ఇచ్చేందుకు 100 శాతం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు పార్టీకి పీసీసీ చీఫ్‌గా పని చేశారన్న రేవంత్.. బీఆర్ఎస్‌కు ఒక్కరైనా బీసీ అధ్యక్షుడు అయ్యాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. సీఈసీ మీటింగ్ పెట్టాలని ఏఐసీసీని కోరామని.. సీఈసీ మీటింగ్ తర్వాత ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందని తెలిపారు.

ప్రగతి భవన్‌ ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం కేసీఆర్‌లో మొదలైందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభ చూసి సీఎంకు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లలో 6లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులదిబ్బగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్లా.. రాహుల్ గాంధీ బ్లఫ్ మాస్టర్ కాదని.. ఆయన అన్నీ నిజాలే మాట్లాడుతారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని రేవంత్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News