Revanth Reddy : లాస్య నందిత మృతికి సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి
Byline : Vinitha
Update: 2024-02-23 03:16 GMT
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాస్య నందితకు సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకుకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం…ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా చనిపోవడం అత్యంత విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.