Revanth reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ తొలి ట్వీట్

Byline :  Bharath
Update: 2023-12-05 14:25 GMT

తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. సేధీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను సీఎంగా ప్రకటించింది. డిసెంబర్ 7న రాజ్ భవన్ లో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎంగా ఎంపికైన తర్వాత ప్రజలనుద్దేశించి రేవంత్ తొలి ట్వీట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. ఈ క్రమంలో అధిష్టానం అధికారికంగా సీఎంను ప్రకటించకముందే రేవంత్ ట్వీట్ చేయడం గమనార్హం.

‘‘తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాల’’ని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎంను ప్రకటించిన వెంటనే అధిష్టానాన్ని కలవడం కోసం ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా అధిఫ్టానానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు.

Tags:    

Similar News