తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్గా MCRHRD..!

Byline :  Krishna
Update: 2023-12-10 09:16 GMT

హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రగతిభవన్ సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉండేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రజా భవన్గా మార్చింది. ప్రజాసమస్యలు చెప్పుకునేందుకు అది వేదికగా ఉంటుందని రేవంత్ తెలిపారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి MCRHRDని పరిశీలించారు.

యశోధ ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత రేవంత్ నేరుగా ఎంసీహెచ్‌ఆర్డీకి వెళ్లారు. MCRHRDలో సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ జనావాసాలు కూడా లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని అని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులతో సమావేశమై పలు అంశాలపై ఆయన చర్చించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. 

Tags:    

Similar News