భట్టి క్రేజ్కు రేవంత్ రెడ్డి బ్రేకులు.. ఖమ్మంలో ఓడించేందుకు స్కెచ్..?

Update: 2023-07-07 06:35 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి జాబితాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు కూడా ఉంటుంది. అయితే భట్టిని సీఎం రేసు నుంచి తప్పించడానికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చినట్లు కొందరు నేతలు అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డికి పోటీ లేకుండా పోతుందని చెప్తున్నారు. ఖమ్మం బహిరంగ సభ తర్వాత ఆ ఊహాగానాలు మరింత బలపడే ఛాన్స్ ఉంది. సొంత నియోజక వర్గంలో భట్టిని ఓడించి, రాజకీయంగా దెబ్బతీసే లక్ష్యంతో పొంగులేటిని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి దింపినట్లు అభిప్రాయ పడుతున్నారు.

109 రోజుల పాదయాత్ర చేసిన భట్టికి గౌరవం ఇవ్వాలని ఖమ్మం సభకు పొంగులేటి చేరిక సభ అని కాకుండా.. భట్టి పాదయాత్ర ముగింపు సభగా నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింది. అయితే, రేవంత్, పొంగులేటి కలిసి ఈ సభకు భట్టి పేరు రాకుండా చేశారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ కు గట్టి పోటీ ఇచ్చేది భట్టి ఒక్కడే. పార్టీ అధిష్టానం వద్ద భట్టికి మంచి పేరుంది. దానికి తోడు పాదయాత్ర వల్ల ఆ పేరు మరింత బలపడింది. అందుకే భట్టిని తప్పిస్తే తనకు తిరుగు లేదని రేవంత్ అభిప్రాయపడుతున్నట్లు టాక్. దానికోసమే పొంగులేటిని రంగంలోకి దింపి, ఖమ్మం జిల్లాలో భట్టికి చెక్ పెట్టే వ్యూహం రచిస్తున్నాడు.




Tags:    

Similar News