చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన చేస్తే తప్పేంటి? కేటీఆర్ జాగీరా?..

Update: 2023-09-27 15:31 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి వ్యక్తి అని, అలాంటి సుదీర్ఘ అనుభం ఉన్న నాయకులు దేశంలో వేళ్లమీద లెక్కబెట్టగలంత మంది మాత్రమే ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశంసించారు. (Reventh Reddy Questions KTR ) బాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన చేయడంలో తప్పు లేదన్నారు. బాబు అరెస్ట్ గొడవతో రాష్ట్రానికి సంబంధం లేదని, నిరసనలు సరికాదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ విరుచుకుపడ్డారు.

‘హైదరాబాద్ ఏపీ, తెలంగాణలకు పదేళ్లు రాజధాని. ఏపీ అంశంపై ఇక్కడ నిరసన తెలిపితే మీకెందుకు అభ్యంతరం? ఆందోళన చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం మతిలేని పని. వాళ్లను అడ్డుకుంటే ప్రజలు చెంపలు వాయిస్తారు. అంతగా అయితే వినతిపత్రం తీసుకుని అనుమతి ఇవ్వాలిగాని నిరసనే కుదరదంటే ఎలా? వచ్చే ఎన్నికల్లో ఏపీ సెటిలర్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతారు’’ అని రేవంత్ హెచ్చరించారు. ఏపీ వాళ్లతో ఓట్లు వేయించుకుని, పన్నులు కట్టించుకుని ఈరోజు వారి సమస్య మన రాష్ట్రం సమస్య కాదని అంటే మూతి పండ్లు రాలగొడతారని తీవ్ర వ్యఖ్యలు చేశారు. ‘‘నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది? హైదరాబాద్ ఏమన్నా కేటీఆర్ జాగీరా?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ అంశాలపై కేసీఆర్ ఢిల్లీలో వెళ్లి నిరసన తెలిపిన విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు.


Tags:    

Similar News