హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

Update: 2023-06-25 15:57 GMT

హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్‌.. కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వరంగల్లోని కాశిబుగ్గకు చెందిన నరసింహస్వామి(50), సాంబరాజు(42), ఆకాంక్ష(26) లక్ష్మిప్రసన్న (6)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. బాధితులు మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కటాక్షపూర్‌-ఆత్మకూరు మధ్య ప్రమాదం జరిగింది. 

కర్నూలులో ముగ్గురు..

మరోపక్క.. కర్నూలు జిల్లాలోని కోడుమూరులో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. హోళగుంద నుంచి తెలంగాణకు వస్తున్న బోలోరే వాహనాన్ని ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. మృతులను హోళగుంద మండలానికి చెందిన మల్లయ్య (హెబ్బటం), వీరయ్య ( కురుకుంద), ముత్తయ్య (కొత్తపేట)గా గుర్తించారు. 


Tags:    

Similar News