బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా...గులాబీ గూటికి చేరిక!

Byline :  Vamshi
Update: 2024-03-16 09:40 GMT

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.బహుజన్ సమాజ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నిన్న బీఎస్పీ-బీఆర్‌ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్ర పొత్తును భగ్నం చేయాలని ప్రయత్నాలు కవిత అరెస్ట్‌తో సహా చేస్తొంది. బీజేపీ కుట్రలకు భయపడను నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. చివరివరకు బహున వాదాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా అని ట్వీట్ చేశారు.కాగా ఆయన బీఆర్‌ఎస్‌లోకి చేరనున్నారు.

నందినగర్‌లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి ప్రవీణ్ కుమార్ వెళ్లున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరనున్నారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి పంపించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం బహుజన వాదం అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News