Bus Owners Strike:మహిళలకు షాకింగ్ న్యూస్.. రేపట్నుంచి బస్సులు బంద్!
తెలంగాణలో ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే మహిళలకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహాలక్ష్మీ పథకం పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంతో ప్రస్తుతం బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ ఉచిత బస్సు స్కీం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అద్దె బస్సు యజమానులు తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.
వారి వాదన ప్రకారం, . మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు తమ బస్సులలో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారని దానివల్ల తమ బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగటం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని, లేదంటే ఐదవ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యజమానులు హెచ్చరించారు. వారి సమ్మె కారణంగా తెలంగాణలో బస్సు సేవలు స్తంభించే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉచిత బస్సు ప్రయాణం స్కీం కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తానికి ఉచిత బస్సు జర్నీ స్కీం విషయంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.