గ్రామీణ పోస్టల్ ఉద్యోగల సమ్మె ఉధృతంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. 8 గంటల పనిదినం, 180 లీవుల ఎన్‌క్యాష్‌మెంట్, బీమా, గ్రాట్యుటీ పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు నిరసన బాట పట్టారు. మంగళవారం నుంచి మొదలైన నిరవధిక సమ్మె మూడో రోజు గురువారం ఉధృత రూపం దాల్చింది. యూనియన్లకు అతీంగా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఏపీ, తెలంగాణల్లోనూ సమ్మె సాగుతోంది. అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఉద్యోగులు ధర్నా చేశారు. సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
గంటల పని, పెన్షన్ సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేరస్తున్నారు. 12, 24, 36 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసిన వారికి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. కమలేశ్ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, జీడీఎస్‌తోపాటు కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి గ్రాడ్యుటీ పెంచాలని కోరుతున్నారు. బిజినెస్ టార్గెట్ల పేరుతో వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.