సీపీఐఎంఎల్ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 14న బయ్యారం ప్రాంతంలో సీపీఎంఎల్ నేతలు కామ్రేడ్ అశోక్, కామ్రేడ్ గోపన్నతో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు తలపెట్టకుండా వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పారు. కాగా వారి అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సీపీఐఎంఎల్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.