‘ప్రభుత్వం కూలిపోతుందనటం మంచిది కాదు’: కూనంనేని

Byline :  Bharath
Update: 2023-12-16 11:15 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు.. ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామ’ని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి అందరూ సహకరించాలని కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలం అయిందో కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేసి, రాబోయే రోజుల్లో పని చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిని ఆయన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వం 2020లో జరిగిన సమావేశాల్లో 17 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని అన్నారు. సభ్యులంతా నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వారి మాటలు ఆరోగ్యదాయకంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు మాని, సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇన్ని ప్రతీ హామీ నెరవేర్చారని అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞానికి నిధులు వాటంతటవే సమకూరాయని తెలిపారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదని ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News