Medaram Jathara : మేడారానికి పోటెత్తిన భక్తులు.. గద్దెపై కొలువుదీరిన సారలమ్మ..
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. బుధవారం మొదలైన ఈ మహా జాతర శనివారం వరకు కొనసాగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుననారు. తొలిరోజే అమ్మవారిని 25లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. లక్షల మంది భక్తుల రాకతో మేడారం మరో కుంభమేళాను తలపిస్తుంది. జాతరలో భాగంగా అర్థరాత్రి సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. కన్నెపల్లి నుంచి తీసుకొచ్చిన సారలమ్మను అర్థరాత్రి 12.12 నిమిషాలకు గద్దెపై ప్రతిష్ఠించారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెపై కొలువుదీరారు.
ఇవాళ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గద్దెపై సమ్మక్క కొలువుదీరనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఎస్పీ కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. గద్దెలపై ఇవాళ ఇద్దరు అమ్మవార్లు కొలవుదీరనుండడంతో భక్తులు తాకిడి పెరగనుంది. గురు, శుక్రవారాల్లో సుమారు కోటి మంది అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది.