జడ్చర్లలో స్కూల్ బస్సు బోల్తా.. 20మంది విద్యార్థులకు తీవ్రగాయాలు
Byline : Krishna
Update: 2023-10-09 05:18 GMT
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్ బాసిల్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా.. జడ్చర్ల సమీపంలోని కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులోని విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.