సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కగా ఉండే ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆ తర్వాత కొన్ని చెక్కింగ్స్ చేసి హోటల్ ను సీజ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆల్ఫా హోటల్ లో లోయర్ ట్యాంక్ బండ్ కు చెందిన జమాలుద్ధీన్.. మటన్ కీమా రోటీ తిన్నాడు. దాంతో అతను అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర వాంతులు చేసుకున్నాడు. పరిస్థితి దారుణంగా మారడంతో.. హాస్పిటల్ లో చేరగా జమాలుద్దీన్ కు ఫుడ్ పాయిజన్ అయిందని తేలింది. దీంతో అతను ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై మొదట మేనేజర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోగా.. ఆ తర్వాత మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ పై రైడ్స్ చేసి.. ఫుడ్‌లో నాణ్యత, శుభత్ర లేనట్లు గుర్తించారు. అనంతరం హోటల్ ను సీజ్ చేసి యాజమాన్యానికి నోటీసులు అందించారు. ప్రస్తుతం జమాలుద్దీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.