హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. రహదారుల విస్తరణ కోసం 33 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సికింద్రాబాద్ బోర్డ్ అంగీకారం తెలిపింది.ఎన్‌హెచ్-44 ప్యారడైజ్ నుంచి సుచిత్ర, ఎన్ హెచ్ 1 జింఖానా గ్రాండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్నిఆమోదించినట్లు కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో మధుకర్ నాయక్ తెలిపారు. ఆర్మీ, ప్రైవేటు, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని ఆయన వెల్లడించారు.33 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 329 కోట్లను ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
బోయిన్‌పల్లి, తిరుమలగిరి మార్గాల్లో గత కొంతకాలంగా ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్కైవేలు, మెట్రో కారిడార్, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలోనే 33 ఎకరాలు ఇచ్చేందుకు సికింద్రిబాద్ బోర్డ్ అంగీకారం తెలిపింది. తాజా నిర్ణయంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఊరట లభించనుంది. కంటోన్మెంటో నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది
secunderabad cantonment board decided to give 33 acre land to government.
secunderabad cantonment board, decided , give 33 acre land, telangana government