సీనియర్ ఐపీఎస్ నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్ట్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. భన్వర్ లాల్ ఇంట్లో నవీన్ కుమార్ అద్దెకు ఉంటున్నారు. అయితే ఇళ్లు ఖాళీ చేయకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కబ్జాకు యత్నించారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి.. విచారణ చేస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంఘాలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని నవీన్ కుమార్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.