తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి.. ఉత్తర్వుల జారీ

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి.. ఉత్తర్వుల జారీ

By :  Kiran
Update: 2024-02-25 09:03 GMT



రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే.శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ.. ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరు అవుతారనే చర్చకు తెరపడినట్లు అయింది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఇంతకు ముందే పని చేశారు. ప్రస్తుతం ఆయన ‘ప్రజాపక్షం‘ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. జీవో వెలువడిన తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.


Tags:    

Similar News