ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించాయి. ప్రణీత్‌రావు 3 రకల నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.17 కంప్యూటర్ల ద్వారా పోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డడిస్కులు ధ్వంసం చేసినట్లు తెలిపారు. పాత హార్డ్‌డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్‌డిస్క్‌ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
17 సిస్టంల ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఫోన్ టాపింగ్ కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రణీత్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్‌ను మానిటర్ చేసిన ప్రణీత్.. సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకునే వాడు. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలలో మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన వంద నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు? అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది. రేవంత్‌రెడ్డిని ఎవరు? ఎక్కడ కలుస్తున్నారు? అన్న సమాచారాన్ని ప్రణీత్‌రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది.