Breaking News : తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బ‌దిలీ

By :  Kiran
Update: 2023-12-14 13:10 GMT

తెలంగాణ‌లో ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ఆమ్రపాలిని నియమించారు. మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జ్ ఎండీగా ఆమెకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా శైల‌జా రామ‌య్య‌ర్, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్‌గా బి. గోపి నియమితులయ్యారు.

ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శిగా రిజ్విగా నియమించిన ప్రభుత్వం ఆయనకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ట్రాన్స్‌కో జాయింట్ ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్క‌ర్, సౌత్ డిస్క‌ం సీఎండీగా ముషార‌ఫ్ అలీ, నార్త్ డిస్కం సీఎండీగా క‌ర్నాటి వ‌రుణ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.




Tags:    

Similar News