Councillors Resign : గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్ ..పలువురు కౌన్సిలర్లు రాజీనామా

Update: 2024-02-09 04:02 GMT

లోక్ సభ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో వలసలు మొదలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తుప్రాన్ మున్సిపాలిటీలోని ఏడుగురు కౌన్సిలర్లు రాజీనామ చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, చైర్శన్ వ్యవహార శైలిని కౌన్సిలర్లు మంత్రికి వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. వారిద్దరు వారంలో జాయిన్ అవుతారని టాక్. ఇక తెలంగాణ ఉద్యమకారుడు తొలి నుంచి బీఆర్‌ఎస్ విధేయుడు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు.

పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత.. సీఎం రేవంత్‌, ఏఐసీసీ నేత కేసీవేణుగోపాల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్‌ ఎంపీ.. పార్టీమారడం బీఆర్‌ఎస్‌కు పెద్ద షాకనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోందిప్పుడు. త్వరలో బీఆర్ఎస్‌కు చెందిన స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ వంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీళ్లంతా పార్టీ మారేందుకే రేవంత్‌ను కలిశారనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ విషయాన్ని వీళ్లు ఖండించారు. కానీ, ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అయినా వీళ్లంతా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News