మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అధికారులు షాకిఇచ్చారు. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారని తేలడంతో హైదరాబాద్ దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, ఏరోనాటికల్ భవనాలను కూల్చారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజ్‌లో కొన్ని నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్, గండి మైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. గతంలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో మల్లారెడ్డి సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన అల్లుడుని కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మల్లారెడ్డి అన్నా సంగతి తెలిసిందే.