Kidnaped Anchor Pranav : యాంకర్‌ను కిడ్నాప్ చేసిన త్రిష..పెళ్లి ప్లాన్ అట్టర్ ఫ్లాప్!

Byline :  Shabarish
Update: 2024-02-23 10:51 GMT

ఓ టీవీ ఛానెల్ యాంకర్‌ను త్రిష అనే యువతి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆ యువకుడు అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో త్రిష అక్కడితో ఆగకుండా ఆ యాంకర్‌ను కిడ్నాప్ చేసింది. త్రిష చెర నుంచి తప్పించుకున్న ఆ యాంకర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్ లోని ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా ప్రణవ్ పనిచేస్తున్నాడు.

త్రిష అనే యువతి యాంకర్ ప్రణవ్‌ను భారత్ మ్యాట్రిమోని సైట్‌లో మొదట చూసింది. ప్రణవ్ ఫోటోలు చూసి అతన్ని ఎంతగానో ఇష్టపడింది. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని త్రిష ఫిక్స్ అయ్యింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాంకర్ ప్రణవ్ తన ఫోటోలను భారత్ మ్యాట్రిమోని సైట్లో తన ఫోటోలను పెట్టలేదు. సైబర్ కేటుగాళ్లు ప్రణవ్ పేరుతో నకిలీ ఐడీ క్రియేట్ చేసి పెట్టారు. ప్రణవ్ పేరుపై డబ్బులు సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు స్కెచ్ వేశారు. ఇకపోతే అది నిజంగానే ప్రణవ్ ఐడీ అనుకుని త్రిష అతన్ని ఇష్టపడింది.

ఒకరోజు ప్రణవ్‌ని త్రిష రూమ్‌కు పిలిచింది. ఆ సమయంలోనే తన ప్రేమను, ఇష్టాన్ని తెలిపింది. అయితే ప్రణవ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అతన్ని గదిలోనే బంధించిన త్రిష నరకం చూపించింది. ప్రణవ్‌ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ప్రణవ్ ఆ గదిలో నుంచి బయటపడి తప్పించుకున్నాడు. సరాసరి పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయాన్నంతా చెప్పేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదు స్టార్టప్ కంపెనీలకు ఎమ్‌డీ‌గా ఉన్న త్రిషను అరెస్ట్ చేశారు. మొత్తానికి కోట్లాది రూపాయలు ఉన్న త్రిష ఇలా కిడ్నాప్ కేసులో కటకటాలపాలైంది.


Tags:    

Similar News