Driving Licenses : షాకింగ్..13 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు

Update: 2024-01-29 05:13 GMT

తెలంగాణలో ప్రమాదాలు జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపేవారికి, ట్రాఫిక్ రూల్స్ పాటించనివారికి జరిమానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వారికి రవాణాశాఖ గట్టి షాక్ ఇచ్చింది. ప్రమాదాలకు కారణమయ్యే వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టి వారి లైసెన్సులను రద్దు చేయనుంది. ఇందులో భాగంగా గత ఏడాది ప్రమాదాలకు కారకులైన 13 వేల మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను తెలంగాణ రవాణా శాఖ రద్దు చేసింది.

రోడ్డు ప్రమాదాలకు కారకులైనవారిలో అత్యధికంగా డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఎక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ తెలిపింది. రద్దు చేసిన లైసెన్సులను తిరిగి ఆరు నెలల తర్వాత పునరుద్దరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ నెల 22వ తేది వరకూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా 13,767 మంది లైైసెన్సులను రద్దు చేసినట్లు ప్రకటించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 7,564 వాహనాలు నమోదు కాగా, ప్రమాదాలకు కారణమైన వారివి 783 వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటును ప్రతి నెలా సుమారు 1,147 లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అందులో 70 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం వాహనాలను నడపాలని, ప్రమాదాలకు కారణం కావొద్దని ఈ సందర్భంగా రవాణాశాఖ వాహనదారులకు సూచించింది.


Tags:    

Similar News