రైతాంగం ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తోంది : హరీష్ రావు
Byline : Krishna
Update: 2023-12-09 09:36 GMT
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రైతు బంధు కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు. అధికారం పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటామన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి.. తాము బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు రైతులకు హామీ ఇచ్చారని.. రూ. 500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని.. అలాంటి రైతులను ఆదుకోవాలని కోరారు.