Singareni Workers : సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కోక్కరి అకౌంట్లో..
కార్మికులకు సింగరేణి సంస్థ దసరా బోనస్ ఇచ్చింది. 1.53లక్షల చొప్పున అకౌంట్లలో జమ చేసింది. మొత్తం 42వేల మంది కార్మికులకు సింగరేణి లాభాల్లో 32శాతం వాటాను బోనస్గా ఇచ్చింది. రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్ కూడా చెల్లించే అవకాశం ఉంది. పండగకు మూడురోజుల ముందే బోనస్ జమ చేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల మేర లాభాలు వచ్చినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. ఈ లాభాల్లోని 32శాతం వాటా అంటే.. రూ.711 కోట్లను కార్మికులకు అందించారు. గతేడాది సంస్థ లాభాల్లో 30 శాతం అంటే రూ. 368 కోట్లు వాటాను బోనస్గా ఇవ్వగా.. అంతకుముందు 29 శాతం వాటాను బోనస్గా ఇచ్చారు. పోయిన ఏడాదికంటే ఈసారి 2 శాతం బోనస్ పెరిగింది. కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది.