సాయిచంద్ భార్యకు నియామక పత్రాల అందజేత

Update: 2023-07-07 17:05 GMT

ఇటీవల ఆకస్మికంగా చనిపోయిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్(38) భార్య రజనిని రాష్ట్ర ప్రభుత్వ ఆ పదవిలో నియమించింది. సీఎం కేసీఆర్ తరఫున నియామక పత్రాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సింగరేణి కార్మిక సంఘ అధ్యక్షుడు కంగర్ల మల్లయ్య, బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం రజనికి అందించారు.

సాయిచంద్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ తరపున రూ.1.50 కోట్లు కూడా ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమ పార్టీ ప్రజాప్రతినిధుల ఒక నెల వేతనం నుంచి సమకూరుస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతామని, బీఆర్ఎస్ వారి శ్రమ, త్యాగాలతో నిర్మాణమైందని అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్ని ఊరూవాడా తన పాటలో హోరెత్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై అనేక పాటలు రాసి, పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు.

Tags:    

Similar News