సిరిసిల్ల ఖ్యాతిని పెంచిన నేతన్న.. బంగారంతో..

Update: 2023-08-11 16:27 GMT

చేనేత కళకు పుట్టినిళ్లు అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నల్ల విజయ్ అనే కళాకారుడు అద్భుతం సృష్టించాడు. బంగారం, వెండితో ప్రత్యేక చీర తయారుచేసి శభాష్ అనిపించుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి తన కూతిరి వివాహం కోసం విజయ్ దగ్గర్ తయారుచేయించాడు. 20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో చేసిన ఈ చీర బరువు సుమారు 500 గ్రాములు ఉంటుంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి ప్రతిభ చాటుకున్న నల్ల పరంధాములు చిన్న కొడుకు విజయ్. తన తండ్రి నుంచి వారసత్వంగా కళను పొనికిపుచ్చుకుని.. విజయ్ కూడా ఆకర్షరనీయమైన చీరలను తయారుచేశాడు.

గతంలో విజయ్ తయారుచేసిన పరిమళాలు వెదజల్లే చీర ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. ఇప్పటివరకు విజయ్.. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువా, దబ్బనంలో దూరే పట్టు చీరన నేశాడు. అంతేకాకుండా కుట్టు లేకుండా లాల్చీ పైజామా, తామర నారతో చీర, అరకు నారతో శాలువా తయారు చేశాడు. గతంలో విజయ్ సీఎం కేసిఆర్ కు బహుమతిగా ఇచ్చారు. కాగా, ఈ బంగారు చీరను నేయడానికి నెల రోజుల సమయం పట్టిందని, రూ. 1,80,000 ఖర్చు అయినట్లు చెప్పుకొచ్చాడు.

Sirisilla weaver Nalla Vijay made the saree out of gold

Sirisilla, Sirisilla weaver, Nalla Vijay, saree with gold, gold saree

Tags:    

Similar News